వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్‌.. మీ ఫేవ‌రెట్‌ చాట్స్ ఇక ఎప్పుడూ పైనే!


Fri,May 19, 2017 01:08 PM

న్యూఢిల్లీ: వాట్సాప్ యూజ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌. మీ ఫేవ‌రెట్ చాట్స్ కోసం ఇక ప్ర‌తిసారి కింది వ‌ర‌కు స్క్రోల్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. మీరు ఎక్కువగా చాట్ చేసే గ్రూపులు, వ్య‌క్తుల‌ను పిన్ చేసుకొని ఎప్పుడూ పైనే ఉండేలా చేసే స‌రికొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ యూజ‌ర్లు కూడా ఇప్పుడీ కొత్త ఆప్ష‌న్‌ను వాడుకోవ‌చ్చు. గ‌రిష్ఠంగా మూడు ఫేవ‌రెట్ చాట్స్‌ను యూజ‌ర్లు ఎంపిక చేసుకోవ‌చ్చు. మీ ఫేవ‌రెట్ చాట్ అనుకున్న దానిని ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే పైన పిన్ ఐకాన్ ఒక‌టి క‌నిపిస్తుంది. దానిని సెల‌క్ట్ చేసుకుంటే.. ఆ చాట్ ఇక ఎప్పుడూ పైనే ఉంటుంది. ఒక‌వేళ దీనిని అన్‌పిన్ చేయాల‌నున్నా మ‌ళ్లీ ఇలాగే చేయాలి. ప్ర‌స్తుతానికి గ‌రిష్ఠంగా మూడు కాంటాక్ట్స్‌కే ఈ అవకాశం ఇచ్చింది వాట్సాప్‌.

1752

More News

VIRAL NEWS