షియోమీకి పోటీగా రూ.37వేలకే 'వూ' ఆండ్రాయిడ్ 4కె టీవీ..!


Tue,March 13, 2018 02:42 PM

'వూ (Vu)' సంస్థ భారత్‌లో తన తొలి 4కె ఆండ్రాయిడ్ టీవీని ఇవాళ ఆవిష్కరించింది. 43, 49, 55 ఇంచ్ డిస్‌ప్లే సైజ్‌లలో ఈ ఆండ్రాయిడ్ టీవీలు విడుదలయ్యాయి. ఇవి 4కె అల్ట్రాహెచ్‌డీ (3480 x 2160 పిక్సల్స్) స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉన్నాయి. షియోమీ ఈ మధ్యే ఈ తరహా టీవీలను విడుదల చేయగా అందుకు పోటీగా వూ ఈ కొత్త టీవీలను లాంచ్ చేసింది. 55 ఇంచుల టీవీ రూ.55,999 ధరకు లభిస్తుండగా, 49 ఇంచుల టీవీ రూ.46,999 ధరకు, 43 ఇంచుల టీవీ రూ.36,999 ధరకు లభిస్తున్నాయి. వీటిని ఈ నెల 16వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో విక్రయించనున్నారు.

వూ విడుదల చేసిన టీవీలలో పలు ఆకట్టుకునే ఫీచర్లు లభిస్తున్నాయి. ఈ టీవీలకు ఇచ్చే రిమోట్లలో వూ యాక్టివాయిస్ అనే ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీని సహాయంతో యూజర్లు తమ వాయిస్ ద్వారా టీవీలో సెర్చ్ చేయవచ్చు. 88 భాషలకు వీటిల్లో సపోర్ట్‌ను అందిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ఆల్ట్‌బాలాజీ తదితర సంస్థలతో వూ భాగస్వామ్యమైనందున ఆయా కంపెనీలకు చెందిన యాప్స్‌ను ఈ టీవీల్లో ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. ఇవే కాకుండా టీవీలను వైఫై లేదా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేస్తే గూగుల్ ప్లే స్టోర్‌లో యూజర్లు తమకు నచ్చిన యాప్స్‌ను టీవీల్లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

వూ ఆండ్రాయిడ్ 4కె టీవీల్లో డాల్బీ డిజిటల్, డీటీఎస్ సపోర్ట్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2.5 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ (ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఆధారితం), డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, హెచ్‌డీఎంఐ, ఈథర్‌నెట్ పోర్టులు, వాయిస్ కంట్రోల్ రిమోట్ తదితర ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి.

2342

More News

VIRAL NEWS

Featured Articles