వివో బంపర్ ఆఫర్.. స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు..!


Wed,May 16, 2018 07:17 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వివో భారత్‌లోని వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఇవాళ వివో నాకవుట్ కార్నివాల్ సేల్ పేరిట ఓ ప్రత్యేక సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగనుండగా ఇందులో పలు వివో ఫోన్లు భారీ తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి.

వివో నాకవుట్ కార్నివాల్ సేల్‌లో వివో వీ5 ప్లస్, వీ5ఎస్ ఫోన్లు వరుసగా రూ.14,990, రూ.12,990 ధరలకు లభిస్తున్నాయి. అలాగే ఈ సేల్‌లో ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఫోన్లను కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తారు. దీంతోపాటు రూ.1వేయి విలువైన లక్కీ డ్రా కూపన్లు, రూ.500 విలువైన బుక్ మై షో కపుల్ మూవీ వోచర్లు లభిస్తాయి.

5586

More News

VIRAL NEWS