ఈ ఫోన్ ప‌గ‌ల‌దు, నీటిలో త‌డ‌వ‌దు..!


Sat,August 12, 2017 05:19 PM

యూల్‌ఫోన్ సంస్థ 'ఆర్మ‌ర్ 2' పేరిట ఓ నూత‌న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. రూ.17,300 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 15వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. కాగా ఈ ఫోన్‌ను చాలా దృఢ‌మైన మెటీరియ‌ల్‌తో త‌యారు చేశారు. దీని వ‌ల్ల ఫోన్ అంత సుల‌భంగా ప‌గ‌ల‌దు. అంతేకాదు, నీటిలో ప‌డినా ఏమీ కాదు. లోప‌లికి నీరు పోదు. - 40 డిగ్రీల నుంచి 80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త‌లలోనూ ఈ ఫోన్‌ను నిర‌భ్యంత‌రంగా ఉప‌యోగించుకోవ‌చ్చు. గ్లాస్ ఫైబ‌ర్, రీయిన్‌ఫోర్స్‌డ్ పాలీకార్బొనేట్‌, మెటల్‌తో ఈ ఫోన్‌ను త‌యారు చేయ‌డం వ‌ల్ల చాలా దృఢంగా, సుర‌క్షితంగా ఉంటుంది. ఇక ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌తో ఫోన్‌ను కేవ‌లం 0.1 సెకండ్ల టైంలోనే అన్‌లాక్ చేసుకోవ‌చ్చు. డార్క్ గ్రే, గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ ల‌భిస్తున్న‌ది.
Ulefone-Armor-2

యూల్‌ఫోన్ ఆర్మ‌ర్ 2 ఫీచ‌ర్లు...


5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.0 నూగట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, బారోమీట‌ర్‌, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 4700 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

3126

More News

VIRAL NEWS