రూ.999కే 15600 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్..!

Mon,January 9, 2017 05:09 PM

యూఐఎంఐ టెక్నాలజీస్ సంస్థ 'యూఐఎంఐ యూ8' పేరిట ఓ నూతన పవర్ బ్యాంక్‌ను విడుదల చేసింది. రూ.999 ధరకు ఈ పవర్ బ్యాంక్ వినియోగదారులకు లభ్యమవుతోంది. 15600 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని ఈ పవర్ బ్యాంక్ కలిగి ఉంది. 5V/2A సామర్థ్యం కలిగిన రెండు పోర్టులు దీనికి ఉన్నాయి. వాటి ద్వారా ఏక కాలంలో రెండు ఫోన్లకు చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టి ఉంచినా దీనికి ఏమీ కాదు. అందుకు అనుగుణంగా ఈ పవర్ బ్యాంక్‌లో ఓవర్ డిశ్చార్జి అనే ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీంతోపాటు 180 డిగ్రీల కోణంలో తిరిగే టార్చి లైట్‌ను ఇందులో అమర్చారు. పవర్ ఇండికేటర్‌ను తెలియజేసేందుకు ఓ బ్లూ లైట్ ఉంది. ఈ పవర్ బ్యాంక్‌ను ఫుల్ చార్జి చేయడానికి 14 గంటల సమయం పడుతుంది.

1983

More News

మరిన్ని వార్తలు...