ఊబర్ లైట్ యాప్‌ను లాంచ్ చేసిన ఊబర్


Wed,June 13, 2018 03:59 PM

ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఊబర్ కేవలం ఇండియాలోని తన వినియోగదారులకు గాను 'ఊబర్ లైట్' పేరిట ఓ నూతన యాప్‌ను ఇవాళ విడుదల చేసింది. తక్కువ స్టోరేజ్ స్పేస్ ఉండే ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా ఈ లైట్ యాప్‌ను విడుదల చేసినట్లు ఊబర్ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ డివైస్‌లకు అనుగుణంగా ఈ యాప్‌ను డిజైన్ చేసినట్లు తెలిపారు. ఈ యాప్ సాధారణ ఊబర్ యాప్ కన్నా చాలా తక్కువ సైజ్ ఉంటుంది. సాధారణ ఊబర్ యాప్ 40 ఎంబీ సైజ్ ఉండగా, ఊబర్ లైట్ యాప్ కేవలం 5 ఎంబీ సైజ్ మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ ఈ యాప్‌లో వినియోగదారులు క్యాబ్‌ను సులభంగా బుక్ చేసుకోవచ్చు.

కేవలం 2జీ ఇంటర్నెట్ మాత్రమే ఉన్నా సరే యాప్ చక్కగా పనిచేస్తుంది. కాకపోతే వినియోగదారులకు సాధారణ యాప్‌లోలా పలు యానిమేషన్లు, మ్యాప్స్ ఇతర ఫీచర్లు లభించవు. కానీ సాధారణ యాప్ కన్నా లైట్ యాప్‌లోనే వేగంగా క్యాబ్ బుక్ చేసుకునేందుకు వీలుంటుందని ఊబర్ ప్రతినిధులు తెలిపారు. కాగా ఈ యాప్ ఆండ్రాయిడ్ 4.1 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లలో ఇన్‌స్టాల్ అవుతుంది. మరోవైపు ఓలా కూడా గతంలో ఇలాంటిదే లైట్ యాప్‌ను లాంచ్ చేసింది. ఓలా లైట్ యాప్ సైజ్ కేవలం 1 ఎంబీ మాత్రమే ఉండడం విశేషం.

1712

More News

VIRAL NEWS