ఈ 'జీవి'కి అసలు చావు లేదు..!


Sat,December 26, 2015 07:07 PM

సృష్టిలో ప్రాణంతో జన్మించిన ప్రతి ఒక్క జీవి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. మానవులకే కాక వివిధ రకాల ప్రాణులకి వాటి జీవిత కాలం వేర్వేరుగా ఉంటుంది. కొన్ని ఎక్కువ కాలం, మరికొన్ని తక్కువ కాలం బతుకుతాయి. అయితే కొందరు సైంటిస్టులు తాజాగా చేసిన పరిశోధనల్లో 'పాలిప్(polyp)' అని పిలవబడే ఒక 'చిన్న హైడ్రా(hydra)'జీవికి అసలు చావే లేదని తెలిసింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వీటిని ఉంచితే అసలు మృత్యువు వీటి దరికి చేరదని, వయస్సు పెరగదని తేలింది.

అమెరికాలోని పమోనా కాలేజ్ ప్రొఫెసర్ డానియెల్ మార్టినెజ్‌తో కలిసి అదే కాలేజీకి చెందిన ఇతర పరిశోధకులు ఒక ప్రయోగాన్ని చేశారు. దాదాపు 2,256 హైడ్రాలను సేకరించి ఒక్కో దాన్ని ఒక్కో చిన్నపాటి పాత్రలో శుభ్రమైన మంచినీటిలో ఉంచారు. వారంలో 3 సార్లు వాటికి కావల్సిన ఆహారాన్ని అందించారు. అదే సమయంలో ఆయా పాత్రల్లోని నీటిని కూడా మార్చారు. 2 ల్యాబొరేటరీల్లో ఈ ప్రయోగం దాదాపు 8 సంవత్సరాల పాటు జరిగింది.

చివరిగా ఈ హైడ్రాలకు మరణం రాదని, అవి ఎప్పటికీ అలాగే ఉంటాయని, వాటి వయస్సు కూడా పెరగదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రయోగానికి సంబంధించిన ఫలితాలపై సంబంధిత శాస్త్రవేత్తలు మాట్లాడుతూ 'పరిశుభ్రమైన మంచినీటిలో హైడ్రాలను ఉంచి వాటికి తగిన ఆహారాన్ని ఇస్తూ, నీటిని మారుస్తూ ఉండడం వల్లే అవి చనిపోకుండా ఎప్పటిలాగే ఉన్నాయని, మానవుల వయస్సు పెరిగే క్రమం, మరణం తదితర అంశాలకు చెందిన రహస్యాలను ఛేదించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుంద'ని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో మనిషి విషయంలో 'వయస్సు, మృత్యువు'లను జయించే రోజు వస్తుందేమోననిపిస్తుంది కదూ!

14147
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS