సూపర్ మారియో రన్.. త్వరలో ఆండ్రాయిడ్‌పై..!


Mon,March 20, 2017 05:46 PM

టీవీ వీడియో గేమ్ రూపంలో ఒకప్పుడు సూపర్ మారియో గేమింగ్ ప్రియులను ఏవిధంగా అలరించిందో అందరికీ తెలిసిందే. మొన్నా మధ్యే ఈ గేమ్ ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై విడుదలవగా కొన్ని కోట్ల మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే ఇకపై ఈ గేమ్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై కూడా లభ్యం కానుంది. ఈ నెల 23వ తేదీన సూపర్ మారియో రన్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై విడుదల కానుంది. ఇప్పటికే ఈ గేమ్‌ను ఆడేందుకు ఎంతో మంది ముందుగా రిజిస్టర్ చేసుకోగా వారంతా గేమ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. అయితే ఐఓఎస్ గేమ్‌లో మాదిరిగానే ఇందులోనూ గేమ్‌లో 3 లెవల్స్ ఆడాక రూ.620 వన్ టైం ఫీజు చెల్లించేలా గేమ్ డెవలపర్లు నిబంధన విధించనున్నారు.

969

More News

VIRAL NEWS