జీమెయిల్‌లో త్వరలో కొత్త ఫీచర్..!


Mon,March 20, 2017 04:32 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన జీమెయిల్‌లో త్వరలో ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. యూజర్లు ఇకపై తమకు అటాచ్‌మెంట్ల రూపంలో వచ్చే వీడియోలను డౌన్‌లోడ్ చేయకుండానే నేరుగా మెయిల్‌లోనే చూడవచ్చు. ఇప్పటి వరకు యూజర్లు తమకు వచ్చే ఏదైనా వీడియో ఫైల్‌ను ఓపెన్ చేయాలంటే ఆ ఫైల్‌ను పూర్తిగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై అలా కాదు. నేరుగా ఆ ఫైల్‌ను ఓపెన్ చేసి వీడియోను వీక్షించవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. అతి త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది.

1900

More News

VIRAL NEWS

Featured Articles