సోనీ నుంచి ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ2 ప్లస్ స్మార్ట్‌ఫోన్


Wed,July 11, 2018 09:22 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సోనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ2 ప్లస్ ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో 6 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. 6జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఈ ఫోన్‌లో అమర్చారు. దీని వల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. అలాగే వెనుక భాగంలో 23 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న పవర్‌ఫుల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇక వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ2 ప్లస్ ఫీచర్లు...


6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 23 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3580 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

2579

More News

VIRAL NEWS

Featured Articles