HomeTechnology News SanDisk launched worlds smallest usb type c flash drive

ప్రపంచంలో బుల్లి పెన్ డ్రైవ్ ఇదే..!

Published: Thu,January 11, 2018 12:22 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

SanDisk launched worlds smallest usb type c flash drive

ప్రపంచంలోనే అత్యంత చిన్న సైజ్ ఉన్న పెన్ డ్రైవ్‌ను సాన్‌డిస్క్ సంస్థ తాజాగా విడుదల చేసింది. లాస్‌వెగాస్‌లో జరుగుతున్న కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) 2018లో సాన్‌డిస్క్ తన అల్ట్రాఫిట్ యూఎస్‌బీ 3.1 ఫ్లాష్ డ్రైవ్‌ను లాంచ్ చేసింది. ఈ డ్రైవ్ 16, 32, 64, 128, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో లభిస్తున్నది. రూ.1400 ప్రారంభ ధరకు ఈ పెన్ డ్రైవ్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ పెన్ డ్రైవ్‌లలో 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌లో యూజర్లు ఏకంగా 14వేల ఫొటోలు, 10 గంటల ఫుల్ హెచ్‌డీ వీడియోలు, 16వేల పాటలను స్టోర్ చేసుకోవచ్చు. యూఎస్‌బీ టైప్ సి సపోర్ట్ ఉన్నందున ఈ డ్రైవ్‌లోకి వేగంగా ఫైల్స్‌ను కాపీ చేసుకోవచ్చు.

3295

Recent News