గెలాక్సీ వాచ్, స్మార్ట్ స్పీకర్లను విడుదల చేసిన శాంసంగ్


Fri,August 10, 2018 10:51 AM

శాంసంగ్ సంస్థ తన నూతన స్మార్ట్‌వాచ్ గెలాక్సీ వాచ్‌తోపాటు, గెలాక్సీ హోమ్ స్మార్ట్ స్పీకర్‌ను తాజాగా విడుదల చేసింది. నిన్న రాత్రి న్యూయార్క్‌లో జరిగిన ఈవెంట్‌లో గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌తోపాటు ఈ డివైస్‌లను శాంసంగ్ విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ వాచ్‌లో 1.2 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.15 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ఎగ్జినోస్ 9110 ప్రాసెసర్, 768 ఎంబీ ర్యామ్, 4జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.0, ఐఓఎస్ 9.0 కంపాటబిలిటీ, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, హార్ట్ రేట్ సెన్సార్, 472 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 రోజుల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు ఉన్నాయి. రూ.24వేల ధరకు ఈ వాచ్ లభిస్తున్నది. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ వాచ్‌ను అమెరికా మార్కెట్‌లో విక్రయించనున్నారు. నేటి నుంచి ప్రీ ఆర్డర్లు షురూ కానున్నాయి. త్వరలో భారత మార్కెట్‌లోనూ ఈ వాచ్ విడుదల కానుంది.

గెలాక్సీ హోమ్ స్మార్ట్ స్పీకర్ శాంసంగ్ అభివృద్ధి చేసిన బిక్స్‌బీ డిజిటల్ అసిస్టెంట్ సహాయంతో పనిచేస్తుంది. యూజర్లు ఇచ్చే వాయిస్ కమాండ్లకు అనుగుణంగా ఈ స్పీకర్ స్పందించి తగు విధంగా సమాధానాలు ఇస్తుంది. అయితే ఈ స్పీకర్‌కు సంబంధించిన ధర, ఇతర వివరాలను మాత్రం శాంసంగ్ వెల్లడించలేదు. త్వరలో ఈ వివరాలు తెలిసే అవకాశం ఉంది.

918

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles