శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ కొత్త వేరియెంట్లు..!


Wed,May 16, 2018 05:45 PM

శాంసంగ్ సంస్థ తన గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు గాను నూతన రంగు వేరియెంట్లను త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్లకు చెందిన మిడ్‌నైట్ బ్లాక్, టైటానియం గ్రే, కోరల్ బ్లూ, లైలాక్ పర్పుల్ కలర్ వేరియెంట్లు ఇప్ప‌టికే ల‌భ్య‌మ‌వుతుండ‌గా త్వ‌ర‌లో స‌న్‌రైజ్ గోల్డ్‌, బ‌ర్గండీ రెడ్ క‌ల‌ర్ వేరియెంట్ల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఇక వీటిలో ఫీచర్లు గతంలో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ ఫోన్లలోలాగే ఉంటాయి. వాటిలో ఎలాంటి మార్పు లేదు. కాగా ఈ నూతన వేరియెంట్లు ముందుగా కొరియా మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయి. తరువాత ఇతర దేశాల్లోనూ విడుదల అవుతాయి. అయితే విడుదల తేదీలను మాత్రం శాంసంగ్ ఇంకా వెల్లడించలేదు. కానీ జూన్ చివరి వారంలో ఈ వేరియెంట్లను విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది.

2355

More News

VIRAL NEWS