శాంసంగ్ నుంచి గెలాక్సీ ఆన్7 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్


Thu,January 11, 2018 12:53 PM

శాంసంగ్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'గెలాక్సీ ఆన్7 ప్రైమ్‌'ను ఈ వారం చివర్లో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో 5.5 ఇంచ్ భారీ డిస్‌ప్లే, 4జీబీ పవర్‌ఫుల్ ర్యామ్, ముందు భాగంలో 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3500 ఎంఏహెచ్ పవర్‌ఫుల్ బ్యాటరీ వంటి ఫీచర్లను ఏర్పాటు చేశారు.

శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్ ఫీచర్లు...


5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

1550
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS