'స్మార్ట్ స్క్రీన్‌'పై 'రోబోమేట్ ప్లస్' ఉచిత పాఠాలు..!

Mon,December 21, 2015 04:29 PM

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు జన బాహుళ్యంలో బాగా ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో కేవలం ఒకే టచ్‌తో ఎలాంటి సమాచారాన్నయినా పొందేందుకు వీలు కలిగింది. టిక్కెట్ బుక్కింగ్స్, బిల్ పేమెంట్స్, ఫొటోలు తీసుకోవడం, వీడియోలు చూడడం, పాటలు వినడం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, గేమ్స్ ఇలా ఒకటేమిటి అనేక రకాల పనులను మనం ఇప్పుడు వీటి ద్వారా నిర్వహించుకోగలుగుతున్నాం. అంతేకాకుండా ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో రకరకాల యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో స్క్రీన్‌లపై పాఠాలను చెప్పే విద్యా రంగానికి చెందిన యాప్స్ చాలానే ఉన్నాయి. అయితే ఇదే కోవలో తాజాగా మరో యాప్ కూడా విద్యార్థులకు పాఠాలను బోధించేందుకు సిద్ధమైంది.

robomate-plus


ఎంటీ ఎడ్యుకేర్ రూపొందించిన 'రోబోమేట్ ప్లస్ ఫ్రీ వీడియో లెక్చర్స్ (Robomate+ Free Video Lectures)' యాప్ ద్వారా ఇప్పుడు విద్యార్థులు ఐఐటీ, సీఏ, ఎంబీఏ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌సీ, హెచ్‌ఎస్‌సీ తదితర పరీక్షల్లో మంచి స్కోర్‌ను సాధించవచ్చు. ఇందులో ఆయా అంశాలకు చెందిన పాఠాలు ఆడియో, వీడియోల రూపంలో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ దేశవ్యాప్తంగా ఉన్న నిష్ణాతులైన అధ్యాపకుల ఆధ్వర్యంలో రూపొందించారు. కేవలం ఒక హెడ్‌సెట్ లేదా స్పీకర్ ఉంటే చాలు ఎన్ని పాఠ్యాంశాలనైనా విద్యార్థులు ఈ యాప్ ద్వారా నేర్చుకునేందుకు వీలు కల్పించారు. 7.1 ఎంబీ సైజ్ మాత్రమే ఉన్న ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ కలిగిన యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

13931

More News

మరిన్ని వార్తలు...