పేటీఎం ద్వారా విదేశీ క‌రెన్సీ ఇంటికే డోర్ డెలివ‌రీ..!


Wed,July 11, 2018 05:48 PM

పేటీఎం సంస్థ ఫారెక్స్ సేవలను ఇవాళ ప్రారంభించింది. భారత్‌లో ఉన్న పేటీఎం వినియోగదారులు తమకు కావల్సిన దేశానికి కరెన్సీని పేటీఎంలో ఆర్డర్ చేయవచ్చు. ఈ క్రమంలో వినియోగదారులకు పేటీఎం ఫారెక్స్ కార్డు లేదా క్యాష్ అందిస్తారు. ఇందుకు ముందుగా మొత్తం సొమ్ములో 2 శాతం చెల్లించి ఫారెక్స్ రేట్లను లాక్ చేసుకోవచ్చు. అనంతరం డెలివరీ సమయంలో మిగిలిన మొత్తాన్ని నెఫ్ట్ లేదా ఆర్‌టీజీఎస్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సేవ ద్వారా పేటీఎం 20 ప్రముఖ దేశాలకు చెందిన కరెన్సీని అందిస్తున్నది.

పేటీఎం అందించే ఫారెక్ట్ కార్డును ఏ దేశంలో అయినా ఏటీఎంలో వినియోగించుకోవచ్చు. లేదంటే మర్చంట్ లావాదేవీలు నిర్వహించినప్పుడు స్వైప్ చేయవచ్చు. ఏటీఎంలో స్వైప్ చేసి అందులో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. పేటీఎం ఫారెక్స్ సర్వీస్ ద్వారా కస్టమర్లు ఏడాదికి 2.50 లక్షల డాలర్లను ఫారెక్స్ కార్డులోకి లోడ్ చేయవచ్చు. అలాగే 3వేల డాలర్లను కరెన్సీ నోట్ల రూపంలో పొందవచ్చు. పేటీఎం ఫారెక్స్ సర్వీస్ వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై వినియోగదారులకు లభిస్తున్నది.1809

More News

VIRAL NEWS