ఈ నెల 28 నుంచి వన్‌ప్లస్ 5టీ అమ్మకాలు


Tue,November 14, 2017 06:03 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 5టీని ఈ నెల 16వ తేదీన విడుదల చేయనున్న విషయం విదితమే. కాగా ఫోన్ ఇంకా విడుదల కానప్పటికీ ఈ డివైస్ అమ్మకాల తేదీల‌ను మాత్రం ఆ సంస్థ కన్‌ఫాం చేసింది. వన్‌ప్లస్ 5టీ ఈ నెల 28వ తేదీ నుంచి వినియోగదారులకు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుంది. అయితే అంతకు వారం ముందుగానే.. అంటే ఈ నెల 21వ తేదీనే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఈ ఫోన్ ఫ్లాష్ సేల్‌లో లభ్యం కానుంది. ఆ రోజున సాయంత్రం 4.30 గంటలకు వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌కు గాను ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ సంస్థ తెలియజేసింది. ఇక ఈ ఫోన్ 6/8 జీబీ ర్యామ్ వేరియెంట్లలో లభ్యం కానుండగా, ప్రారంభ ధర రూ.38వేలుగా ఉండనున్నట్టు సమాచారం.

2956

More News

VIRAL NEWS