వాట్సప్‌లో ఇకపై 30 మీడియా ఫైల్స్ పంపొచ్చు..!


Wed,January 11, 2017 12:58 PM

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన యూజర్ల కోసం తాజాగా రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే డివైస్‌లో ఉన్న వీడియోలను జిఫ్‌లుగా పంపుకునే వీలు కల్పించగా ఇప్పుడు యాప్‌లోనే పలు జిఫ్‌లను సెర్చ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మీడియా ఫైల్స్ సెండింగ్ పరిమితి కూడా పెంచింది. ఇప్పటి వరకు కేవలం 10 మీడియా ఫైల్స్‌ను మాత్రమే పంపుకునేందుకు వీలుండగా ఇకపై 30 మీడియా ఫైల్స్‌ను యూజర్లు పంపుకోవచ్చు. అయితే ఈ ఫీచర్లు ప్రస్తుతానికి వాట్సప్ బీటా వెర్షన్ 2.17.6 లోనే అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఫుల్ వెర్షన్‌లోనూ ఈ సౌకర్యాలు అందుబాటులోకి తేనున్నారు. అయితే ఏపీకే మిర్రర్ వంటి థర్డ్ పార్టీ సైట్ల ద్వారా యూజర్లు ముందు చెప్పిన వాట్సప్ బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తద్వారా కొత్త ఫీచర్లను ఉపయోగించుకునే వీలుంది.

1456
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS