'వాట్సప్' ఇప్పుడు ఫ్రీ..!


Mon,January 18, 2016 06:40 PM

వాట్సప్ వినియోగదారులకు శుభవార్త. ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్... ఇలా మీరు ఏ ప్లాట్‌ఫాంలో వాట్సప్‌ను వాడుతున్నా ఇకపై వార్షిక రుసుము (రూ.68) చెల్లించాల్సిన పనిలేదు. ఈ యాప్ సేవలను యూజర్లు ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు. ఒక సంవత్సరం పాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందిన తరువాత సేవలను కొనసాగించాలంటే రుసుము చెల్లించాలని ఇప్పటి వరకు వాట్సప్ యూజర్లకు మెసేజ్ దర్శనమిచ్చేది. కానీ ఇప్పుడు ఆ మెసేజ్ త్వరలో కనుమరుగు కానుంది. రానున్న కొద్ది రోజుల్లోనే ఉచితంగా వాట్సప్‌ను పొందవచ్చని ఆ కంపెనీ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వాట్సప్ ప్రతినిధులు చెబుతున్నా అందుకు వేరే కారణం ఉందని టెక్ పండితులు విశ్లేషిస్తున్నారు. నేటి స్మార్ట్ ప్రపంచంలో ఇతర ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌ల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవాలంటే యూజర్లకు ఇలా సేవలు అందించాల్సిందేనని, ఈ నేపథ్యంలోనే వాట్సప్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

14633
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS