'సాఫ్ట్‌వేర్ కోడింగ్ కోర్సులు' నేర్చుకోవడం ఇప్పుడెంతో ఈజీ..!


Thu,January 14, 2016 11:36 AM

సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించాలనుకునే నిరుద్యోగ యువతీ యువకులు ఎంతో కష్ట పడాల్సి ఉంటుందన్న విషయం విదితమే. ఈ రంగంలో అసలు జాబ్ పొందాలంటేనే ఎన్నో కోర్సులు, నైపుణ్యాలతోపాటు ఆంగ్లభాషా పరిజ్ఞానం కూడా తప్పనిసరిగా అవసరం అవుతుంది. ప్రధానంగా కోర్సుల విషయానికి వస్తే వాటిలో సాఫ్ట్‌వేర్ కోడింగ్ ఉండే ప్రోగ్రామింగ్ భాషలపై పట్టు సంపాదించాల్సిందే. ఇందుకోసం ఏ అభ్యర్థి అయినా ఏదైనా ఇనిస్టిట్యూట్‌కి వెళ్లో, ఎవరైనా తెలిసిన నిపుణుల దగ్గరో ఆయా కోడింగ్ లాంగ్వేజ్‌లను నేర్చుకుంటుంటారు. అయితే ఆంగ్ల భాషపై పరిజ్ఞానం ఉన్న వారు, సొంతంగా నేర్చుకోగలమనే ఆత్మవిశ్వాసం కలిగిన వారు ఇప్పుడు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఎందుకంటే నేటి ఆధునిక ఇంటర్నెట్ ప్రపంచంలో అనేక రకాల సైట్లలో ఆయా ప్రోగ్రామింగ్ భాషలను ఉచితంగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు అలాంటి వెబ్‌సైట్ల గురించి తెలుసుకుందాం.

1. కోడ్ అకాడమీ (www.codecademy.com)
HTML, CSS, Java Script, jQuery, PHP, Python, Ruby, SQL తదితర ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను ఈ సైట్ ద్వారా నేర్చుకోవచ్చు. బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్‌డ్ స్థాయిల్లో ఇందులో కోర్సులను చదవవచ్చు. ట్యుటోరియల్స్ ఉచితంగా లభిస్తున్నా కొంత రుసుం చెల్లిస్లే క్విజ్‌లు, పరీక్షలు, సర్టిఫికెట్లను కూడా పొందేందుకు వీలుంది. ఆయా కోర్సులను నేర్చుకోవాలంటే యూజర్లు ఇందులో ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

2. ది కోడ్ ప్లేయర్ (http://thecodeplayer.com)
HTML5, CSS3, JavaScript వంటి కోర్సులను ఇందులో నేర్చుకోవచ్చు. పలువురు నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించబడిన కొన్ని రకాల సింపుల్ ప్రాజెక్ట్‌లను ఇందులో అందిస్తున్నారు. దీని ద్వారా యూజర్లు వాటిని సులువుగా నేర్చుకునేందుకు వీలుంది.

3. రూబీ కోన్స్ (http://rubykoans.com)
రూబీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను నేర్చుకోవాలనుకునే వారి కోసం ఈ వెబ్‌సైట్‌ను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చారు. రూబీ లాంగ్వేజ్, సింటాక్స్, స్ట్రక్చర్, ఫంక్షన్లు, లైబ్రరీలు వంటి ఎన్నో అంశాలను ఇందులో నేర్చుకోవచ్చు. రూబీ ఫ్రేమ్‌వర్క్‌ను కూడా యూజర్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

4. స్టాక్ ఓవర్‌ఫ్లో (http://stackoverflow.com)
c, c++, c#, jQuery, Python, CSS వంటి కోర్సులను దీంట్లో నేర్చుకోవచ్చు. ఇవన్నీ యూజర్లకు ఉచితంగా లభిస్తున్నాయి. దీంతోపాటు ఇందులోని డెవలపర్లు, యూజర్లకు కనెక్ట్ అవడం ద్వారా వారి సలహాలు, సూచనలు, మెళకువలను తెలుసుకునేందుకు వీలుంది.

5. మొబైల్ టట్స్ ప్లస్(http://code.tutsplus.com)
వెబ్ డెవలప్‌మెంట్, వర్డ్‌ప్రెస్, మొబైల్ డెవలప్‌మెంట్, PHP, ఫ్లాష్, Java Script, iOS SDK, CMS తదితర కోర్సులను దీంట్లో అభ్యసించవచ్చు. ట్యుటోరియల్స్, ఆర్టికల్స్, టిప్స్, వీడియోలు ఇలా ఆయా సబ్జెక్టులకు చెందిన పాఠ్యాంశాలు ఇందులో ఉన్నాయి.

6. ఆలిసన్ (https://alison.com)
PHP, MySQL, Perl, Python, C తదితర లాంగ్వేజ్‌లను దీంట్లో నేర్చుకోవచ్చు. విద్యార్థులతోపాటు కోర్సులను నేర్పించే శిక్షకులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ విజ్ఞానాన్ని మరింత పెంచుకునేందుకు అవకాశం కల్పించారు.

7. పిక్ ఎ ట్యుటోరియల్ (www.pickatutorial.com)
c, c++, AJAX, Android, HTML, CSS, Adobe Air, Adobe Flex, XML, Java Script, jQuery, Flash, ActionScript, ColdFusion, PHP, PHP - GTK, Joomla, Drupal, Ruby, Python, Core Java, J2EE, Perl, Cobol, Delphi, SQL, Oracle, ASP 3.0, ASP.NET, C#.NET, Visual Basic, Visual Basic.NET, VBScript, .NET Framework, Cloud Computing, Silverlight, LINQ, Windows Azure, Visual FoxPro, AppleScript తదితర ఎన్నో రకాల కోర్సులకు చెందిన ట్యుటోరియల్ సైట్ల వివరాలను ఇందులో అందిస్తున్నారు.

8. డబ్ల్యూ3 స్కూల్స్ (www.w3schools.com)
HTML, CSS, BootStrap, Java Script, jQuery, AppML, AngularJS, JSON, SQL, PHP, ASP, ASP.NET, XML, XSLT, AJAX తదితర కోర్సులను ఇందులో అభ్యసించవచ్చు. ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ పేరిట యూజర్లకు ఇందులో లైవ్ ప్రాక్టికల్స్ కూడా లభిస్తున్నాయి.

14834
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS