త్వరలో విడుదల కానున్న నోకియా X స్మార్ట్‌ఫోన్..?


Mon,April 16, 2018 01:42 PM

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ నోకియా X ను ఈ నెల 27వ తేదీన చైనాలో జరగనున్న ఓ ప్రత్యేక ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఫోన్‌కు చెందిన పలు స్పెసిఫికేషన్లు, ఇమేజ్‌లు నెట్‌లో లీకయ్యాయి. వాటిని బట్టి చూస్తే.. నోకియా X స్మార్ట్‌ఫోన్‌లో.. 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో తదితర ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌కు చెందిన పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

2862

More News

VIRAL NEWS