105, 130 ఫీచర్ ఫోన్లను విడుదల చేసిన నోకియా..!


Mon,July 17, 2017 07:01 PM

'105, 130' పేరిట రెండు నూతన ఫీచర్ ఫోన్లను నోకియా విడుదల చేసింది. నోకియా 105 సింగిల్ సిమ్ వేరియెంట్ రూ.999 ధరకు లభిస్తుండగా, డ్యుయల్ సిమ్ వేరియెంట్ రూ.1149 ధరకు లభిస్తున్నది. అయితే నోకియా 130 ఫోన్ ధరను మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికి కేవలం అందులో ఉండే ఫీచర్లను మాత్రమే నోకియా తెలియజేసింది.

నోకియా 105 ఫోన్‌లో 1.8 ఇంచ్ డిస్‌ప్లే, 4 ఎంబీ ర్యామ్, 4 ఎంబీ స్టోరేజ్, 500 టెక్ట్స్ మెసేజ్ స్టోరేజ్, 2వేల కాంటాక్ట్స్ స్టోరేజ్, 800 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ నోకియా సిరీస్ 30 ప్లస్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా పనిచేస్తుంది. ఇక నోకియా 130 ఫోన్‌లో 1.8 ఇంచ్ డిస్‌ప్లే, వీజీఏ కెమెరా, ఎంపీ3 ప్లేయర్, 4 ఎంబీ ర్యామ్, 8 ఎంబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 1020 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎఫ్‌ఎం రేడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో కూడా నోకియా సిరీస్ 30 ప్లస్ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేశారు.

4087

More News

VIRAL NEWS