వచ్చేసింది... నోకియా ఆండ్రాయిడ్ ఫోన్..!


Sun,January 8, 2017 10:20 AM

స్మార్ట్‌ఫోన్ యూజర్లందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది. ముందుగా అనుకున్న విధంగానే హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా ఫోన్‌ను విడుదల చేసింది. 'నోకియా 6' పేరిట వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ తొలుత చైనా మార్కెట్‌లో లభ్యం కానుంది. అందుకు మరో 2, 3 నెలలు పట్టే అవకాశం ఉంది. భారత్‌లో ఈ ఫోన్ రూ.16,740 ధరకు లభ్యం కానున్నట్టు తెలిసింది.
nokia-6
నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు...

 • 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
 • 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
 • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్
 • 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
 • ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
 • 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
 • 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
 • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ
 • బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ ఓటీజీ
 • 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

 • 3132
  data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

  More News

  VIRAL NEWS