అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరలకు మోటో ఫోన్లు..!


Tue,February 13, 2018 01:19 PM

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో మోటోరోలాకు చెందిన మోటో స్మార్ట్‌ఫోన్లు భారీ తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. వాలెంటైన్స్ డే సందర్భగా ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఇవాళ ప్రారంభమైన ఈ ఆఫర్ ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఆఫర్‌లో భాగంగా నిర్వహిస్తున్న సేల్‌లో పలు మోటో ఫోన్లు భారీ తగ్గింపు ధరలకు వినియోగదారులకు లభ్యమవుతున్నాయి.

అమెజాన్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక మోటో ఫోన్ల సేల్‌లో మోటో జీ5 రూ.11,999 ఉండగా రూ.8,499కే లభిస్తున్నది. అలాగే రూ.16,999 ధర ఉన్న మోటో జీ5 ప్లస్ రూ.6వేలు తగ్గి రూ.10,999కు లభిస్తుండగా, రూ.13,999 ఉన్న మోటో జీ5ఎస్ రూ.11,999కు, రూ.16,999 ఉన్న మోటో జీ5ఎస్ ప్లస్ రూ.13,999కు లభిస్తున్నాయి. ఇక ఈ ఫోన్లకు గాను పాత ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే అదనంగా మరో రూ.2వేల వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

4590

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles