ఎల్‌జీ నుంచి వీ30 ప్లస్ స్మార్ట్‌ఫోన్


Thu,December 7, 2017 10:55 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్‌జీ తన నూతన స్మార్ట్‌ఫోన్ వీ30 ప్లస్‌ను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనుంది. రూ.58,900 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో 6 ఇంచ్ భారీ బెజెల్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 13 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు పవర్‌ఫుల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో క్వాలిటీ ఉన్న ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు. ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను ఇందులో ఏర్పాటు చేశారు.

ఎల్‌జీ వీ30 ప్లస్ ఫీచర్లు...


6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

1190

More News

VIRAL NEWS