రూ.1,999 కే లెనోవో కొత్త స్మార్ట్‌బ్యాండ్..!


Sat,September 8, 2018 12:54 PM

హెచ్‌ఎక్స్03డ‌బ్ల్యూ పేరిట లెనోవో తన నూతన స్మార్ట్‌బ్యాండ్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.1,999 ధరకు ఈ బ్యాండ్ వినియోగదారులకు ప్రత్యేకంగా అమెజాన్ సైట్‌లో ఈ నెల 9వ తేదీ నుంచి లభ్యం కానుంది. ఈ స్మార్ట్‌బ్యాండ్‌లో 0.96 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే, 128 x 32 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హార్ట్‌రేట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 10 రోజుల బ్యాటరీ లైఫ్ తదితర ఫీచర్లున్నాయి. ఈ బ్యాండ్‌ను ఆండ్రాయిడ్ 4.4 ఆపైన వెర్షన్ లేదా ఐఓఎస్ 8.0 ఆపైన వెర్షన్ ఉన్న స్మార్ట్‌ఫోన్లకు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకు గాను ప్రత్యేకమైన యాప్‌ను యూజర్లు ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.

2774

More News

VIRAL NEWS