రూ.14వేల‌కే లీఎకో యాక్షన్ కెమెరా..!


Tue,January 10, 2017 04:51 PM

లీఎకో ఓ నూత‌న త‌ర‌హా యాక్ష‌న్ కెమెరాను తాజాగా విడుద‌ల చేసింది. 'లైవ్‌మ్యాన్ సీ1' పేరిట విడుద‌లైన ఈ కెమెరా 1499 చైనీస్ యువాన్ (భార‌త క‌రెన్సీలో దాదాపుగా రూ.14,759) ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భ్య‌మ‌వుతోంది. ఇందులో 16 మెగా పిక్స‌ల్ సామ‌ర్థ్యం కలిగిన లెన్స్‌ను ఏర్పాటు చేశారు. 140 డిగ్రీ వైడ్ యాంగిల్‌లో దీంతో ఫొటోలు, వీడియోలు తీసుకోవ‌చ్చు. 4కె అల్ట్రా హెచ్‌డీ వీడియోల‌ను కూడా రికార్డ్ చేయ‌వ‌చ్చు. 1.8 ఇంచుల ట‌చ్ స్క్రీన్ డిస్‌ప్లే ఇందులో ఉంది.
Liveman-C1
వైఫై, బ్లూటూత్ 4.0, మైక్రో హెచ్‌డీఎంఐ, 64 జీబీ మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్‌, మైక్రో యూఎస్‌బీ, వాట‌ర్ ప్రూఫ్ (40 మీట‌ర్ల లోతు వ‌ర‌కు), డ‌స్ట్‌, షాక్ ప్రూఫ్‌, 1050 ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి ఇత‌ర ఫీచ‌ర్లు ఈ కెమెరాలో ఉన్నాయి. దీన్ని లీమాల్ చైనా వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు.

1478
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS