రూ.12,999కే లావా విండోస్ ల్యాప్‌టాప్


Thu,October 12, 2017 12:46 PM

'హీలియం 12' పేరిట మొబైల్ తయారీదారు లావా ఓ నూతన విండోస్ 10 ల్యాప్‌టాప్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.12,999 ధరకు ఈ ల్యాప్‌టాప్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో 12.5 ఇంచ్ డిస్‌ప్లే, 1366 x 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.88 గిగాహెడ్జ్ ఇంటెల్ ఆటం ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, వెబ్‌క్యామ్, వీడియో కాలింగ్, వైఫై, బ్లూటూత్ 4.0, విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

7594

More News

VIRAL NEWS