జియో బంపర్ ఆఫర్.. ఉచితంగా 10జీబీ డేటా


Fri,September 7, 2018 04:00 PM

ముంబయి: సరిగ్గా రెండేళ్ల క్రితం.. 2016 సెప్టెంబర్ 5న భారత మార్కెట్లోకి రిలయన్స్ జియో తన సేవలను ప్రారంభించి యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. జియో లాంచ్‌ అయిన కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. వినియోగదారులకు ఉచిత జీవిత కాల కాలింగ్ సదుపాయం కల్పించి సంచలనం సృష్టించింది. తాజాగా రెండో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది.

సెలబ్రేషన్స్ ప్యాక్ పేరుతో ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఉచితంగా 2జీబీ డేటాను అందించనున్నట్లు వెల్లడించింది. మైజియో యాప్‌లోకి వెళ్లి.. మై ప్లాన్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. మొత్తం 10జీబీ డేటాను ప్రీపెయిడ్‌ వినియోగదారులు ఉచితంగా పొందనున్నారు. ఈ బంపర్ ఆఫర్ సెప్టెంబర్ 11తో ముగియనుంది. క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ ఆఫర్‌ను రిలయన్స్‌ జియో సంస్థ గురువారం ప్రకటించింది. ఖాళీ డెయిరీ మిల్క్ పేపర్(రాపర్) ఫొటోను మైజియో యాప్‌లో అప్‌లోడ్ చేస్తే ఉచితంగా 1జీబీ డేటాను యూజర్లకు ఇవ్వనున్నట్లు తెలిపింది.

11949

More News

VIRAL NEWS

Featured Articles