ఐఫోన్ X గోల్డ్ కలర్ వేరియెంట్‌ను లాంచ్ చేయనున్న యాపిల్


Mon,April 16, 2018 12:00 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్ X స్మార్ట్‌ఫోన్‌కు గాను గోల్డ్ కలర్ వేరియెంట్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గతేడాది సెప్టెంబర్‌లో విడుదల కాగా అధిక ధర కారణంగా ఈ ఫోన్‌ను చాలా మంది కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేశారు. ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నప్పటికీ అధిక ధర పెట్టడం ఎందుకన్న కోణంలో యూజర్లు ఆలోచించడంతో ఐఫోన్ X అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఇక ఈ ఫోన్ సిల్వర్, స్పేస్ గ్రే రంగుల్లో మాత్రమే ఇప్పటి వరకు లభ్యమైంది. ఈ క్రమంలో కొత్తగా గోల్డ్ కలర్‌లో ఐఫోన్ X ను యాపిల్ విడుదల చేయనుంది. అయితే దీనికి సంబంధించిన లీక్ ఇమేజ్‌లు ప్రస్తుతం నెట్‌లో విడుదలయ్యాయి. కానీ ఈ వేరియెంట్ మార్కెట్‌లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఆ వివరాలను మాత్రం యాపిల్ వెల్లడించలేదు. జూన్ 4వ తేదీన యాపిల్ తన వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్న నేపథ్యంలో అదే రోజున ఐఫోన్ X గోల్డ్ కలర్ వేరియెంట్‌ను విడుదల చేసేందుకు అవకాశం ఉంది.

1538

More News

VIRAL NEWS