రూ.19,999కే ఐఫోన్ ఎస్‌ఈ..!


Mon,March 20, 2017 07:01 PM

యాపిల్ సంస్థ గతేడాది ఏప్రిల్‌లో నూతన ఐఫోన్ మోడల్ ఐఫోన్ ఎస్‌ఈని విడుదల చేసిన విషయం విదితమే. అయితే ఈ ఫోన్ మొదట్లో యూజర్లకు రూ.39వేలకు లభించింది. కాగా గతేడాది సెప్టెంబర్ నెలలో రూ.5వేల ధర తగ్గి లభ్యమైంది. అయితే ఇప్పుడీ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ.29,999 కే అందిస్తోంది. అమెజాన్‌లో దీని ధర రూ.26,500గా ఉంది. కాగా కేరళకు చెందిన ఐటీ నెట్ ఇన్‌ఫోకాం అనే ఓ రిటెయిల్ స్టోర్ మాత్రం ఐఫోన్ ఎస్‌ఈ 16జీబీ వేరియెంట్‌ను రూ.19,999 ధరకే విక్రయిస్తోంది. అదే 64జీబీ వేరియెంట్ ఐఫోన్ ఎస్‌ఈని కేవలం రూ.25,999 కే అందిస్తోంది. అయితే ఈ ఫోన్లను ఆ స్టోర్‌కు చెందిన వెబ్‌సైట్‌లో మాత్రమే కొనాలి. అది కూడా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు సహాయంతో కొంటేనే వారికి ఆ ధరలకు ఫోన్ లభిస్తుంది.

2220

More News

VIRAL NEWS