భార‌త్ లో ఐఫోన్ 8, 8 ప్ల‌స్, ఐఫోన్ X ధ‌ర‌లివే..! ల‌భించేది ఎప్పుడంటే..?


Wed,September 13, 2017 01:14 PM

యాపిల్ తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 8, 8 ప్ల‌స్‌, ఐఫోన్ X ఫోన్లు భార‌త్‌లో వేర్వేరు తేదీల్లో ల‌భ్యం కానున్నాయి. ఐఫోన్ 8, 8 ప్ల‌స్ ఫోన్లు ఈ నెల 22వ తేదీ నుంచి అమెరికా సహా పలు దేశాల్లో అందుబాటులోకి రానుండగా, భారత్‌లో ఈ నెల 29వ తేదీ నుంచి ఈ ఫోన్లు లభించనున్నాయి. కాగా ఐఫోన్ X భార‌త్‌లో న‌వంబ‌ర్ 3వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. అదే రోజున ప్ర‌పంచ వ్యాప్తంగా ఐఫోన్ X యూజ‌ర్ల‌కు ల‌భిస్తుంది. అయితే గ‌తంలో యాపిల్ ఎప్పుడు కొత్త ఐఫోన్‌ను విడుద‌ల చేసినా ఒక నెల లేదా రెండు నెల‌లు ఆల‌స్యంగా భార‌త్‌లోకి ఆ ఫోన్లు వ‌చ్చేవి. కానీ ప్ర‌స్తుతం అందుకు భిన్నంగా ఐఫోన్ X ప్ర‌పంచ దేశాల‌తోపాటు ఒకేసారి భార‌త్‌లోనూ ల‌భ్యం కానుండ‌డం విశేషం. ఇక ఐఫోన్ 8, 8 ప్ల‌స్ ఫోన్లు మాత్రం వారం రోజులు ఆల‌స్యంగా భార‌త మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. ఈ క్ర‌మంలో ఈ మూడు కొత్త ఐఫోన్ల ధ‌ర‌ల వివ‌రాల‌ను కూడా యాపిల్ ప్ర‌క‌టించింది. అవి మ‌న ద‌గ్గ‌ర కింది ధ‌ర‌ల‌కు ల‌భ్యం కానున్నాయి.

iphone-8-8-plus

ఐఫోన్ 8 (64 జీబీ) - ధ‌ర రూ.64వేలు
ఐఫోన్ 8 (256 జీబీ) - ధ‌ర రూ.77వేలు
ఐఫోన్ 8 ప్ల‌స్ (64 జీబీ) - ధ‌ర రూ.73వేలు
ఐఫోన్ 8 ప్ల‌స్ (256 జీబీ) - ధ‌ర రూ.86వేలు
ఐఫోన్ X (64 జీబీ) - ధ‌ర రూ.89వేలు
ఐఫోన్ X (256 జీబీ) - ధ‌ర రూ.1.02 ల‌క్ష‌లు

6165
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS