ఆండ్రాయిడ్ డివైస్‌ల‌కు కొత్త బ్రౌజ‌ర్ యాప్‌..!


Tue,January 10, 2017 06:34 PM

ఆండ్రాయిడ్ డివైస్‌ల‌ను వాడుతున్న యూజ‌ర్ల కోసం 'ఇన్‌స్టా బ్రౌజ‌ర్ (Insta Browser)' పేరిట ఓ కొత్త ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్ యాప్ తాజాగా అందుబాటులోకి వ‌చ్చింది. దీన్ని యూజ‌ర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్ష‌న్ ఉన్న డివైస్‌ల‌లో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది.

ఇన్‌స్టా బ్రౌజ‌ర్ ద్వారా యూజ‌ర్లు ఏ వెబ్‌సైట్‌నైనా వేగంగా ఓపెన్ చేసుకోవ‌చ్చు. కేవ‌లం 1.3 ఎంబీ మాత్ర‌మే సైజ్ ఉండ‌డంతో ఎలాంటి డివైస్‌లోనైనా దీన్ని తేలిగ్గా వాడ‌వ‌చ్చు. స్టోరేజ్ అయిపోతుంద‌ని దిగులు చెందాల్సిన ప‌నిలేదు. ఇందులో ఉన్న డేటా సేవింగ్ ఫీచ‌ర్ వ‌ల్ల మొబైల్ డేటాతో నెట్‌ను బ్రౌజ్ చేస్తే 80 శాతం వ‌ర‌కు డేటాను ఆదా చేసుకోవ‌చ్చు. వెబ్ పేజీలు వేగంగా ఓపెన్ అయ్యేలా ఇందులో ప‌లు ప్ర‌త్యేక సెట్టింగ్స్‌ను ఏర్పాటు చేశారు. యూజ‌ర్లు తాము విజిట్ చేసిన ఫేవ‌రెట్ సైట్ల‌ను వెంట‌నే యాక్సెస్ చేసుకునేలా ప్ర‌త్యేక స‌దుపాయాన్ని దీంట్లో క‌ల్పించారు. ఇమేజ్‌లు, వీడియోలు వేగంగా డౌన్‌లోడ్ అయ్యేందుకు గాను ఇందులో ఉండే డౌన్‌లోడ్ మేనేజ‌ర్ ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది.

1491
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS