రూ.7,999కే ఇన్ఫినిక్స్ హాట్ 6 ప్రొ స్మార్ట్‌ఫోన్


Wed,July 11, 2018 04:59 PM

మొబైల్స్ తయారీదారు ఇన్ఫినిక్స్ తన నూతన స్మార్ట్‌ఫోన్ హాట్ 6 ప్రొ ను ఇవాళ విడుదల చేసింది. రూ.7,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నారు.

ఇన్ఫినిక్స్ హాట్ 6 ప్రొ ఫీచర్లు...
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

2703

More News

VIRAL NEWS

Featured Articles