ప్రపంచంలోనే మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్న హువావే


Mon,April 16, 2018 12:45 PM

హువావే సంస్థ ప్రపంచంలోనే మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. రానున్న నవంబర్ నెలలో ఈ ఫోన్‌ను హువావే విడుదల చేసే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ఇలాంటి మడతబెట్టే స్మార్ట్‌ఫోన్ తయారీలో శాంసంగ్ కంపెనీ నిమగ్నం కాగా ఇప్పుడు హువావే చేసిన ప్రకటన ఆసక్తిగా నిలిచింది. దీంతో ఈ రెండు సంస్థల్లో మొదట ఏ సంస్థ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

హువావే సంస్థ శాంసంగ్‌కు దీటుగా మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేస్తున్నదని సమాచారం. ఇందులో ఫ్లెక్సిబుల్ ఓలెడ్ డిస్‌ప్లే ఉంటుందని తెలిసింది. దీన్ని ఎల్‌జీ సంస్థ తయారు చేసి హువావేకు ఇస్తున్నదట. మరో వైపు ఇదే కంపెనీ శాంసంగ్‌కు కూడా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలను సప్లయి చేస్తుందని సమాచారం. దీంతో హువావే, శాంసంగ్‌లలో మొదట ఏ కంపెనీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తుందో వేచి చూడాలి.

1690

More News

VIRAL NEWS