'వాట్సప్‌'లో 'పెద్ద సైజ్ ఫైల్స్' షేరింగ్ ఇలా..!


Wed,December 23, 2015 03:05 PM

ఇమేజ్‌లు, వీడియో, ఆడియో క్లిప్స్, డాక్యుమెంట్స్... ఇలా ఫైల్స్ ఏవైనా ఇప్పుడు ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్స్‌లో వీటిని ఎక్కువగా షేర్ చేసుకుంటున్నారు. అయితే ఏ యాప్‌లోనైనా యూజర్లు గరిష్టంగా 16 ఎంబీ వరకు సైజ్ ఉన్న ఫైల్స్‌ను మాత్రమే షేర్ చేసుకునేందుకు వీలుంది. మరి ఫైల్ సైజ్ అంతకు మించితే ఎలా..? అందుకు పరిష్కారమే ఈ యాప్.

ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న 'వాట్స్ టూల్స్: షేర్ ఫైల్ వయా ఐఎం (WhatsTools: Share File Via IM)' యాప్ ద్వారా ఇప్పుడు వాట్సప్ యూజర్లు అధిక సైజ్ కలిగిన ఫైల్స్‌ను కూడా సులువుగా షేర్ చేసుకోవచ్చు. దాదాపు 1 జీబీ వరకు సైజ్ ఉన్న ఫైల్స్ షేరింగ్‌కు ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. ఇతరులకు ఫైల్స్‌ను పంపే సమయంలో నెట్‌వర్క్ ఎర్రర్ లేదా ఇతర ఏ సమస్య ఎదురైనా సెండింగ్/డౌన్‌లోడింగ్‌ను పాజ్, రెజ్యూమ్ చేయవచ్చు. అయితే కేవలం వాట్సప్‌లోనే కాకుండా ఫేస్‌బుక్ మెసెంజర్, హైక్, హ్యాంగవుట్స్ తదితర యాప్స్‌లోనూ దీని ద్వారా ఫైల్స్ షేరింగ్ చేసుకునే వీలు కల్పించారు. దీంతోపాటు మరెన్నో ఫీచర్లు ఈ యాప్‌లో లభిస్తున్నాయి.

13386
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS