స్మార్ట్‌ఫోన్ 'బ్యాటరీ' బ్యాకప్‌ను పెంచుకోండిలా..!


Sun,January 3, 2016 02:52 PM

కాల్స్, ఎస్‌ఎంఎస్, ఇన్‌స్టాంట్ మెసేజింగ్, సెల్ఫీ, సోషల్ నెట్‌వర్కింగ్, బిల్ పేమెంట్, ఇంటర్నెట్ బ్రౌజింగ్... ఇలా చెప్పుకుంటూ పోతే నేడు మనకు లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్లతో కేవలం చిటికెలోనే ఏ పనైనా చేసుకునేందుకు వీలుంది. అయితే ఏ పని చేసినా బ్యాటరీ పవర్ వెంటనే అయిపోవడం ఇప్పుడు అధిక శాతం మంది యూజర్లకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ శక్తిని మరింత పెంచుకునేందుకు కింద పలు 'టిప్స్‌'ను అందిస్తున్నాం. చదివి తెలుసుకోండి.

1. స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ శక్తిని అధికంగా వినియోగించుకునే వనరుల్లో డిస్‌ప్లే ఒకటి. అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ను 20 శాతం తగ్గిస్తే బ్యాటరీ పవర్ కొంత పెరిగేందుకు అవకాశం ఉంది.

2. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే 3జీ, 4జీ వంటి నెట్‌వర్క్‌లు బ్యాటరీని ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. అవసరం లేకపోతే వీటిని డిజేబుల్ చేయడమే ఉత్తమం. దీంతో బ్యాటరీ పవర్ పెరుగుతుంది.

3. స్మార్ట్‌ఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్ డేటా సింకింగ్ ఫీచర్ ఎల్లప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది. దీన్ని ఆఫ్ చేసినా బ్యాటరీ బ్యాకప్ పెరుగుతుంది.

4. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే అప్లికేషన్లను కిల్ చేస్తే బ్యాటరీ ఆదా అవుతుంది. అయితే ఈ ఫీచర్ కొన్ని రకాల స్మార్ట్‌ఫోన్లలో ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. ఇది లేకపోతే ఆయా స్మార్ట్‌ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్‌లకు చెందిన యాప్ స్టోర్‌ల నుంచి టాస్క్ మేనేజర్ పేరిట లభించే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేస్తే సరిపోతుంది.

5. బ్యాటరీ చార్జింగ్, బ్యాకప్ సమయం వంటి అంశాలను ఎప్పటికప్పుడు హోమ్ స్క్రీన్ విడ్జెట్లు, నోటిఫికేషన్ ఐకాన్ల ద్వారా తెలిపే యాప్స్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇన్‌స్టాల్ చేసుకుంటే బ్యాటరీని ఎంత లేదన్నా 20 నుంచి 30 శాతం వరకు పొదుపు చేయవచ్చు.

13400
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS