ఆండ్రాయిడ్ యూజర్లకు మరో కొత్త 'టైపింగ్' యాప్..!


Thu,December 17, 2015 06:37 PM

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్న యూజర్లందరూ తమ మాతృభాషను డివైస్‌లలో ఉపయోగించడం నేటి తరుణంలో అధికమైంది. ప్రధానంగా హిందీ, తెలుగు, తమిళ్, మళయాళం వంటి ప్రాంతీయ భాషల్లో ఈ వాడకం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు అనేక రకాల టైపింగ్ యాప్స్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఫన్నీట్యాప్ టెక్ కంపెనీ 'హైట్యాప్ ఇండిక్ కీబోర్డ్ (Hitap Indic Keyboard - Free)' పేరిట ఓ నూతన యాప్‌ను వినియోగంలోకి తెచ్చింది.

ఈ యాప్‌ను యూజర్లు ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ కలిగిన వారు దీన్ని తమ డివైస్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఇంగ్లిష్‌తోపాటు హిందీ, తెలుగు, మరాఠీ, గుజరాతీ, కన్నడ, మళయాళం, తమిళ్ వంటి వివిధ భాషల్లోనూ టైపింగ్ చేసుకోవచ్చు. ఇలా టైప్ చేసుకున్న వాక్యాలను కాపీ చేసి ఇతర అప్లికేషన్లలో పేస్ట్ చేయడం ద్వారా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు మరెన్నో ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు.

15099
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS