300 ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన హాత్‌వే


Mon,September 10, 2018 08:16 PM

బ్రాడ్‌బ్యాండ్ సేవల కంపెనీ హాత్‌వే 300 ఎంబీపీఎస్ నెట్ స్పీడ్‌తో ఓ నూతన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ చెన్నై కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో కస్టమర్లకు 2టీబీ వరకు ఉచిత డేటా లభిస్తుంది. డేటా లిమిట్ అయిపోగానే స్పీడ్ 5 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. ఇక ఈ ప్లాన్ నెలవారీ రెంటల్‌ను రూ.1699 గా నిర్ణయించారు. ఈ క్రమంలో కస్టమర్లు ఒకేసారి 12 నెలలకు ఈ ప్లాన్‌ను తీసుకుంటే వారికి ఈ ప్లాన్ నెలకు రూ.1250 మాత్రమే అవుతుందని హాత్ వే ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా ఈ ప్లాన్ దేశంలో ఉన్న ఇతర హాత్‌వే బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు ఎప్పుడు అందుబాటులోకి వచ్చేది వెల్లడించలేదు.

3363

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles