గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో కొత్త ఫీచర్


Wed,June 13, 2018 04:37 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ట్రాన్స్‌లేట్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఈ యాప్‌లో ఆఫ్‌లైన్‌లో ట్రాన్స్‌లేట్ ఫీచర్ లభ్యం కాగా, ఇకపై ఇందులో కొత్తగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత ఆఫ్‌లైన్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను అందివ్వనున్నారు. ఈ ఫీచర్ ఇప్పటికే ఈ యాప్‌లో లభిస్తున్నది. దీన్ని పొందాలంటే ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో లభిస్తున్న ఈ ఫీచర్‌లో యూజర్లు చిన్న చిన్న పదాలనే కాకుండా పెద్ద వాక్యాలను కూడా పూర్తిగా ఆఫ్‌లైన్‌లోనే ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. అందుకు ఇంటర్నెట్ అవసరం లేదు. సాధారణంగా ఎవరైనా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ మొబైల్ డేటా లేదా వైఫై దొరకడం కొంత కష్టతరమవుతుంది. అలాంటప్పుడు ఆఫ్‌లైన్‌లో ఈ ఫీచర్ ఉంటే దాంతో భాష పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా. ఇంటర్నెట్ లేకుండానే ఈ ఫీచర్ వల్ల పెద్ద వాక్యాలను కూడా యూజర్లు తమ భాషలోకి అనువాదం చేసుకోవచ్చు.

3058

More News

VIRAL NEWS