ఐఫోన్ X ఓఎస్ తరహాలో ఆండ్రాయిడ్ పి..?


Mon,April 16, 2018 12:52 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్ X స్మార్ట్‌ఫోన్ ఓఎస్‌లో పలు రకాల గెస్చర్ ఆధారిత నావిగేషన్, కంట్రోల్స్‌ను యూజర్లకు అందిస్తున్న విషయం తెలిసిందే. దీని కారణంగా యూజర్ స్క్రీన్‌పై కేవలం స్వైప్ చేస్తే చాలు హోమ్ స్క్రీన్‌కు చేరుకునే అవకాశాన్ని కల్పించారు. అలాగే పలు యాప్స్‌ను, కంట్రోల్స్‌ను ఓపెన్ చేసేందుకు కూడా ఐఫోన్ X ఓఎస్‌లో యూజర్లకు ఫీచర్లు లభిస్తున్నాయి. అయితే ఇదే తరహా ఫీచర్లను గూగుల్ కూడా తన ఆండ్రాయిడ్ పి ఆపరేటింగ్ సిస్టమ్‌లో అందించనున్నట్లు తెలిసింది.

గూగుల్ సంస్థ త్వరలో తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ పి ని విడుదల చేయనుంది. అయితే అందులో ఐఫోన్ X ఓఎస్ తరహాలో గెస్చర్ కంట్రోల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. కాగా దీనికి సంబంధించిన పలు స్క్రీన్ షాట్లు ప్రస్తుతం నెట్‌లో లీకయ్యాయి. వాటిని బట్టి చూస్తే ఆండ్రాయిడ్ ఓఎస్‌లో హోమ్ బటన్‌కు బదులుగా చిన్న బార్‌ను ఏర్పాటు చేశారు. ఇక బ్యాక్ బటన్‌ను పూర్తిగా చిన్నగా చేసి అవసరం ఉన్నప్పుడే వచ్చేలా డిజైన్ మార్చారు. అలాగే యాప్ స్విచర్ బటన్‌ను పూర్తిగా తీసేశారు. ఇవే.. ఆండ్రాయిడ్ పిలో పెద్దగా చేసిన మార్పులుగా కనిపిస్తున్నాయి. వీటితో ఐఫోన్ X తరహాలో గెస్చర్ కంట్రోల్ పద్ధతిలో ఓఎస్‌ను ఆపరేట్ చేసేందుకు వీలుంటుంది. అయితే దీనిపై గూగుల్ స్పష్టత ఇవ్వలేదు. త్వరలో జరగనున్న గూగుల్ ఐ/వో 2018 సదస్సులో ఆండ్రాయిడ్ పి గురించిన విశేషాలను వెల్లడించే అవకాశం ఉంది.

1928

More News

VIRAL NEWS

Featured Articles