రూ.21వేల తగ్గింపుతో గూగుల్ పిక్సల్ 2 స్మార్ట్‌ఫోన్..!


Wed,December 6, 2017 06:56 PM

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ రేపటి నుంచి 3 రోజుల పాటు బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సేల్‌లో భాగంగా అనేక ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లతోపాట కళ్లు చెదిరే డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్నది. అందులో భాగంగా ఇటీవలే విడుదలైన గూగుల్ పిక్సల్ 2 ఫోన్‌పై భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఫోన్ ధర రూ.61వేలు ఉండగా రూ.21వేల తగ్గింపు ధరతో ఈ సేల్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. పిక్సల్ 2 ఫోన్‌ను కొంటే రూ.11వేల ఫ్లాట్ డిస్కౌంట్‌తోపాటు మరో రూ.10వేల డిస్కౌంట్‌ను బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులను బట్టి ఫ్లిప్‌కార్ట్ అందివ్వనుంది. దీంతో రూ.21వేల తగ్గింపు ధరతో రూ.39,999 ధరకే పిక్సల్ 2 ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ఫోన్‌కు గాను పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే మరో రూ.18వేల వరకు అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.

3585

More News

VIRAL NEWS