గూగుల్ ప్లే న్యూస్ స్టాండ్.. గూగుల్ న్యూస్‌గా మార్పు..!


Wed,May 16, 2018 08:09 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ప్లే న్యూస్ స్టాండ్ యాప్‌ను న్యూస్ యాప్‌గా మార్చింది. కాగా ఈ కొత్త అప్‌డేట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ ప్లాట్‌ఫాంలపై వచ్చే వారం నుంచి లభ్యం కానుంది. ఈ క్రమంలో త్వరలో ఆయా యూజర్లు తాము వాడుతున్న గూగుల్ ప్లే న్యూస్ స్టాండ్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే వారంలో ఈ కొత్త యాప్ అప్‌డేట్ 127 దేశాల యూజర్లకు లభ్యం కానుంది.

గూగుల్ న్యూస్ యాప్‌లో పలు కొత్త ఫీచర్లను యూజర్లకు అందివ్వనున్నారు. గూగుల్ న్యూస్ యాప్ పూర్తిగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా పనిచేస్తుంది. యూజర్లకు చెందిన ప్రాంతం, భాష తదితర అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అందుకు తగిన విధంగా న్యూస్ అప్‌డేట్లను సదరు యాప్‌లో అందిస్తుంది. ఇక యాప్‌లో ఏర్పాటు చేసిన ఫర్ యూ అనే ఫీచర్ సహాయంతో యూజర్లు అత్యంత ముఖ్యమైన వార్తలు ఐదింటిని తెలుసుకోవచ్చు. అవి కూడా యూజర్ అభిరుచులకు అనుగుణంగా యాప్‌లో చూపించబడతాయి. అలాగే ఫుల్ కవరేజ్ అనే మరో ఫీచర్ కూడా ఈ యాప్‌లో లభిస్తుంది. దీని వల్ల ఏదైనా వార్తకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రియల్ టైంలో యూజర్లు తెలుసుకోవచ్చు. ఎక్కువగా స్థానిక వార్తలు యూజర్లకు తెలిసేలా న్యూస్ యాప్‌లో సదుపాయం కల్పించారు. దీని వల్ల యూజర్లకు తమ చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుందో మరింత స్పష్టంగా తెలుస్తుంది.

2770

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles