వచ్చేస్తున్నాయ్.. గూగుల్ పిక్సల్ 3 సిరీస్ ఫోన్లు..!


Sat,September 8, 2018 03:30 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన పిక్సల్ స్మార్ట్‌ఫోన్లను వచ్చే నెల 9వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిసింది. న్యూయార్క్ సిటీలో అక్టోబర్ 9వ తేదీన ఓ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు గూగుల్ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఆ ఈవెంట్‌లో ఏయే ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేసేది గూగుల్ తెలియజేయలేదు. కానీ అందులో పిక్సల్ 3 సిరీస్ ఫోన్లను విడుదల చేయవచ్చని తెలిసింది. పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్ ఫోన్లను గూగుల్ తన ఈవెంట్‌లో విడుదల చేస్తుందని సమాచారం. పిక్సల్ 3 సిరీస్ ఫోన్లలో 6.2 ఇంచ్ డిస్‌ప్లే, 3430 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ చార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 850 ప్రాసెసర్ తదితర ఫీచర్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది.

3402

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles