వివో యాక్టివ్ 3 మ్యూజిక్ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసిన గార్మిన్


Wed,June 13, 2018 06:26 PM

ఫిట్‌నెస్ పరికరాల తయారీ సంస్థ గార్మిన్ తన నూతన స్మార్ట్‌వాచ్ వివో యాక్టివ్ 3 మ్యూజిక్‌ను ఇవాళ విడుదల చేసింది. ఇందులో ఇంటిగ్రేటెడ్ మ్యూజిక్ సపోర్ట్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల వాచ్‌లో 500 పాటల వరకు నింపుకోవచ్చు. ఇందుకు గాను ఓ ప్రత్యేక యాప్‌ను అందిస్తున్నారు. దీని సహాయంతో కంప్యూటర్‌కు కనెక్ట్ అయి అందులో ఉన్న మ్యూజిక్ ఫైల్స్‌ను వాచ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అలాగే గార్మిన్ పే పేరిట నూతన పేమెంట్ విధానాన్ని ఇందులో అందిస్తున్నారు.

గార్మిన్ వివోయాక్టివ్ 3 మ్యూజిక్ స్మార్ట్‌వాచ్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. 1.2 ఇంచ్ కలర్ డిస్‌ప్లే, 240 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్, ఆండ్రాయిడ్, ఐఫోన్ కనెక్టివిటీ, స్టెప్ కౌంటర్, ఆటో గోల్స్, స్లీప్ మానిటరింగ్, క్యాలరీస్ బర్న్‌డ్, ఫ్లోర్స్ ైక్లెంబ్డ్, డిస్టాన్స్ ట్రావెల్డ్, ఇంటెన్సిటీ మినట్స్, జీపీఎస్, యాక్టివిటీ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటర్, బారోమెట్రిక్ ఆల్టీమీటర్, కంపాస్, థర్మామీటర్, 7 రోజుల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు ఈ వాచ్‌లో లభిస్తున్నాయి. రూ.20వేల ధరకు ఈ వాచ్ లభిస్తున్నది.

1990

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles