గార్మిన్ ఫోర్ రన్నర్ 645 మ్యూజిక్ స్మార్ట్‌వాచ్ విడుదల


Thu,January 11, 2018 08:28 AM

ఫిట్‌నెస్ పరికరాల తయారీ సంస్థ గార్మిన్ కొత్తగా ఫోర్ రన్నర్ 645 మ్యూజిక్ పేరిట ఓ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. రూ.25,410 ధరకు ఈ వాచ్ యూజర్లకు లభిస్తున్నది. ఇందులో 1.2 ఇంచ్ డిస్‌ప్లే, గార్మిన్ పే, హార్ట్ రేట్ సెన్సార్, యాక్టివిటీ ట్రాకర్, 5 ఏటీఎం వాటర్ రెసిస్టెంట్, 7 రోజుల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్‌ను బ్లూటూత్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఫోన్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకు ప్రత్యేక యాప్ ఆయా ప్లాట్‌ఫాంలపై లభిస్తున్నది. ఇక ఈ వాచ్‌లో దాదాపుగా 500 పాటలను స్టోర్ చేసుకోవచ్చు. వాటిని అవసరం అనుకున్నప్పుడు వినవచ్చు.

1920

More News

VIRAL NEWS