ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్.. భారీ తగ్గింపు ధరకు స్మార్ట్‌ఫోన్లు..!


Tue,March 13, 2018 02:03 PM

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 'మొబైల్స్ బొనాంజా సేల్‌'ను నేడు ప్రారంభించింది. ఈ నెల 15వ తేదీ గురువారం వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా పలు కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లపై వినియోగదారులకు ఆకర్షణీయమైన రాయితీలు, ఆఫర్లు లభిస్తున్నాయి. వాటి వివరాలు మీ కోసం...

* లెనోవో కె8 ప్లస్ (3 జీబీ, 32 జీబీ) - రూ.7,999 (రూ.2వేలు తగ్గింపు)
* ఒప్పో ఎఫ్3 (4జీబీ) - రూ.11,990 (రూ.5వేలు తగ్గింపు)
* గూగుల్ పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ - రూ.49,999
* శాంసంగ్ గెలాక్సీ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ (16 జీబీ) - రూ.9,499
* శాంసంగ్ గెలాక్సీ ఆన్5 - రూ.6,290
* ఎల్‌జీ కే7ఐ - రూ.4,999
* ఐవూమీ ఐ1 - రూ.5,999
* మోటో ఈ4 ప్లస్ (3జీబీ) - రూ.8,999
* శాంసంగ్ గెలాక్సీ ఎస్7 (4జీబీ) - రూ.22,990
* మోటో జడ్2 ప్లే (4జీబీ) - రూ.19,999

పైన చెప్పిన స్మార్ట్‌ఫోన్లు మాత్రమే కాకుండా హానర్ 9 లైట్, షియోమీ రెడ్‌మీ నోట్ 5/నోట్ 5 ప్రొ, రెడ్‌మీ 5ఎ, ఇన్ఫినిక్స్ హాట్ ఎస్3 ఫోన్లపై కూడా ఆఫర్లు లభిస్తున్నాయి. అయితే వీటికి ఫ్లాష్ సేల్ నిర్వహిస్తున్నారు. ఇక ఇవేకాకుండా నోకియా 6 (4జీబీ), మోటో ఎక్స్4 (6జీబీ), మోటో జడ్2 ఫోర్స్ (6జీబీ ర్యామ్), వివో వీ7 (4జీబీ), ఒప్పో ఎఫ్3 ప్లస్ (4జీబీ), వివో వీ7 ప్లస్ (4జీబీ) ఫోన్లపై కూడా ఆఫర్లు లభిస్తున్నాయి. వీటితోపాటు ఆయా ఫోన్లకు నో కాస్ట్ ఈఎంఐ, బై బ్యాక్ గ్యారంటీ, ఎక్స్‌ఛేంజ్ వంటి ఆఫర్లను అందిస్తున్నారు.

6946

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles