ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ షురూ.. మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు..!


Thu,December 7, 2017 08:26 AM

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల కోసం నేటి నుంచి మూడు రోజుల పాటు బిగ్ షాపింగ్ డేస్ పేరిట ప్రత్యేక ఇయర్ ఎండింగ్ సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలు, ఫ్యాషన్, లైఫ్‌ స్టైల్‌, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఫర్నిచర్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన రాయితీలు, ఆఫర్లను అందిస్తున్నది. ముఖ్యంగా ఈ సేల్‌లో మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించిన బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో షియోమీ ఎంఐ ఎ1 4జీబీ వేరియెంట్ రూ.2వేల తగ్గింపు ధరతో రూ.12,999 ధరకే లభిస్తున్నది. దీంతోపాటు శాంసంగ్ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ (64 జీబీ) రూ.5వేల తగ్గింపుతో రూ.12,900కు, మోటో సీ ప్లస్ రూ.1వేయి తగ్గింపుతో రూ.5,999కు, ఐఫోన్ 7 (32 జీబీ) రూ.9,001 తగ్గింపుతో రూ.39,999 ధరకు, లెనోవో కె8 ప్లస్ రూ.1వేయి తగ్గింపుతో రూ.10,999 ధరకు, మోటో జీ5 ప్లస్ రూ.6వేల తగ్గింపుతో రూ.10,999 ధరకు, హానర్ 6ఎక్స్ రూ.2వేల తగ్గింపుతో రూ.9,999 ధరకు, గెలాక్సీ ఎస్7 రూ.16వేల తగ్గింపుతో రూ.29,990 ధరకు లభిస్తున్నాయి. ఇక ఏ ఉత్పత్తిని అయినా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అయితే పైన ఇచ్చిన స్మార్ట్‌ఫోన్లు మాత్రమే కాకుండా ఇంకా అనేక మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు యూజర్లకు లభిస్తున్నాయి.

6977

More News

VIRAL NEWS