ఈ నెల 14 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాలీ సేల్


Thu,October 12, 2017 11:50 AM

ఇటీవలే బిగ్ బిలియన్ డేస్ ప్రత్యేక సేల్‌తో వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందించిన ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ దీవాలీ సేల్' పేరిట మరో ప్రత్యేక సేల్‌కు సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా టీవీలు, ఇతర గృహోపకరణాలపై 70 శాతం వరకు రాయితీని అందివ్వనుంది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోళ్లు జరిపితే యూజర్లకు మరో 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీంతోపాటు రెడ్‌మీ నోట్ 4, లెనోవో కె8 ప్లస్, షియోమీ రెడ్‌మీ 4ఎ, మోటో సి ప్లస్, మోటో ఈ4 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ జె7 (2016), ఐఫోన్ 6, శాంసంగ్ గెలాక్సీ ఎస్7, ఐఫోన్ 7 ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందివ్వనుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాలీ సేల్‌లో ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు పానాసోనిక్ ఎలూగా రే ఎక్స్ ఫోన్‌కు గాను ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నారు. ఈ ఫోన్‌ను ధర రూ.8,999 ఉండగా సేల్‌లో భాగంగా రూ.2వేల తగ్గింపుతో రూ.6,999 ధరకే అందివ్వనున్నారు. ఇదే కాకుండా పలు రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం వరకు రాయితీని అందజేయనున్నారు.

2027

More News

VIRAL NEWS