ప్రపంచంలో అత్యంత చిన్నదైన విండోస్ మినీ పీసీ ఇదే..!


Tue,March 13, 2018 06:01 PM

ఎలైట్ గ్రూప్ కంప్యూటర్ సిస్టమ్స్ (ఈసీఎస్) సంస్థ 'లివా క్యూ' పేరిట ప్రపంచంలో అత్యంత చిన్నదైన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత మినీ పిసీని ఇవాళ భారత్‌లో లాంచ్ చేసింది. ఈ పీసీ బరువు కేవలం 260 గ్రాములు మాత్రమే. ఇందులో ఇంటెల్ అపోలో లేక్ ప్రాసెసర్లు, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, విండోస్ 10 హోమ్ ఓఎస్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక హెచ్‌డీఎంఐ పోర్టు, ఒక ఈథర్‌నెట్ పోర్టు ఉన్నాయి. ఈ పీసీలో వెసా మౌంట్ పోర్టును కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఈ పీసీని మానిటర్లు, టీవీలకు కనెక్ట్ చేసుకోవచ్చు. విండోస్ 10 ఓఎస్ లేకుండా అయితే ఈ మినీ పీసీ రూ.13,500 ధరకు లభిస్తుంది. అదే విండోస్ 10 ఓఎస్ కావాలనుకుంటే ఈ పీసీని రూ.15,500 ధరకు కొనుగోలు చేయవచ్చు. త్వరలో ఈ మినీ పీసీ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్స్‌లో లభ్యం కానుంది.

2804

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles